
మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి గారి మాతృమూర్తి కాసు శేషమ్మ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే KR నాగరాజు గారు…
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాసు వెంగళరెడ్డి సతీమణి మరియు మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, అలాగే వైయస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ కాసు శేషమ్మ ఇటీవల మరణించగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హైదరాబాదులోని జెఆర్సి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని శేషమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం సీఎం తో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
