విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే KR నాగరాజు

విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే KR నాగరాజు గారు…

వర్ధన్నపేట నియోజకవర్గం లోని 66వ డివిజన్లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థులు మిషన్ భగీరథ పైపులైన్లు మరమ్మత్తుల వల్ల నీటి సమస్య ఉందని డయల్ యువర్ ఎమ్మెల్యే ఫోన్ కాల్ కి వెంటనే స్పందించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కళాశాల విద్యార్థుల సమస్య పరిష్కారం కొరకు డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్ నేతృత్వంలో వాటర్ ట్యాంకులను పంపి సమస్యను పరిష్కారం చేశారు.మిషన్ భగీరథ పైపులైన్లు మరమ్మత్తులు జరుగుతున్న నేపధ్యంలో ప్రజలకు,విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య ఉన్న డయల్ యువర్ ఎమ్మెల్యే నెంబర్ కి సంప్రదించాలని పిలుపునిచ్చారు.నియోజకవర్గంలోని ప్రజలకు సమస్యల పరిష్కారం కొరకు పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top