
శ్రీ మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజున జరుపుకునే ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని ఖాజా నగర్ లో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు మరియు ముస్లిం సోదరులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి, అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ “మిలాద్-ఉన్- నబీ” శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, ప్రేమ, సోదరభావం, ధర్మ చింతన ప్రతి మానవుడిలో ఉండాలని సూచించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ సర్వమానవ సమానత్వం, శాంతి స్థాపనే లక్ష్యంగా సాగిన మహ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలన్నారు… ముస్లిం సోదర, సోదరీమణులకు ‘ఈద్ మిలాద్-ఉన్-నబి’ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ముస్లింలు రంజాన్, బక్రీద్ తర్వాత ఘనంగా జరుపుకునే పండుగల్లో మిలాద్ ఉన్ నబీ పండుగ ఒకటి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, మూడో నెల అయిన రబీ-ఉల్ అవ్వల్ మాసంలో 12వ రోజున మిలాద్ ఉన్ నబీ వేడుకలను జరుపుకుంటారు. అరబిక్ భాషలో మిలాద్ లేదా మౌలిద్ అంటే మహమ్మద్ పుట్టినరోజు అని మహ్మద్ ప్రవక్తను స్మరించుకుంటూ, తన బోధనలు, మానవత్వం, కరుణ, సోదరభావం వంటి విలువలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలను జరుపుకుంటారు, ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివరి ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడు. ముస్లిములందరూ అత్యంత పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ గ్రంథంలో వీటి గురించి పేర్కొనబడింది. ప్రవక్త మహమ్మద్ ను విశ్వ శాంతి కోసం అల్లాహ్ నియమించారని, అందుకే తను జన్మించిన రోజున, ఆయనను స్మరించుకుంటూ ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగను జరుపుకుంటారు అని PAC చైర్మన్ గాంధీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
