
అయ్యప్ప దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు నీరజా శంకర్ గౌడ్‌కు ఘన సన్మానం..
సూర్యాపేట జిల్లా/కోదాడ
కోదాడలోని శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హుజూర్‌నగర్ వాస్తవ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 264 కంఠమేశ్వర స్వామి విగ్రహాల దాత నీరజా శంకర్ గౌడ్, కుటుంబ సభ్యులను గౌడ సంఘం నాయకులు మరియు అయ్యప్ప స్వామి సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.ఆదివారం ఆలయ ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన శంకర్ గౌడ్ సమాజానికి,భక్తి రంగానికి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప స్వామి సంఘం స్టేట్ మరియు జిల్లా అధ్యక్షులు ముత్తినేని కోటేశ్వరరావు, వాసుదేవరావు,జై గౌడ ఉద్యమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశగాని నాగేశ్వరరావు, రాష్ట్ర గౌరవ ఉపాధ్యక్షుడు సోమగాని నర్సింహారావు,మునగాల గౌడ సంఘం నాయకులు గండు అంజయ్య గౌడ్,నారగాని వెంకయ్య గౌడ్,నారగాని వెంకన్న గౌడ్,గుడిబండ గ్రామ సంఘ అధ్యక్షుడు కుక్కడపు సైదులు,సింగారం గ్రామ గౌడ సంఘ నాయకులు రావుల కోటయ్య, రావుల కొండలరావు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
