
పదవీ విరమణ శేష జీవితం కాదు, విశేష జీవితం
విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి……….జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్ గౌడ్
వనపర్తి
పదవీ విరమణ శేష జీవితం కాదు విశేష జీవితం అన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మరియు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఉద్యోగులు తమ పదవీ విరమణ తార్వత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమాజ సేవ కోసం ఉపయోగించుకోవాలనీ అన్నారు. ముప్పై రెండు సంవత్సరాల పాటు ఉద్యోగ విధులు నిర్వహించి పదవి విరమణ చెంధిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వివేకానంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తకోట లో జరగిన సమావేశం లో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకిత భావంతో ఉద్యోగ విధులు నిర్వహించిన వారు అదే స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలలో, వ్యవసాయ పనులలో నిమగ్నం కావాలని సూచించారు. మండల అభివృద్ధి అధికారిగా చక్కని బాధ్యతలు చేపట్టిన సేవలను వారు కొనియాడారు. ప్రజలతో ఆమెకు గల అనుబంధాన్ని కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో MEO కృష్ణయ్య MEO ఫరూక్ హుస్సేన్, ghms నిర్మలా దేవి, విష్ణు,ప్రవీణ్ కుమార్ సురేష్,యూనియన్ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
