
నూతన ఉప తపాలా కార్యాలయాన్ని ప్రారంభించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలా కార్యాలయాల సూపరింటెండెంట్ గౌరవ శ్రీ V. వీరభద్ర స్వామి గారు
నేలకొండపల్లి: నేలకొండపల్లి నూతన ఉప తపాలా కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు DCDP – Dak Community Development Programme కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి సబ్ పోస్ట్‌మాస్టర్ శ్రీ G. కృష్ణయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలా కార్యాలయాల సూపరింటెండెంట్ గౌరవ శ్రీ V. వీరభద్ర స్వామి గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన ఉప తపాలా కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం సౌత్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ శ్రీ P. శ్రీనివాస్ గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే నేలకొండపల్లి సర్పంచ్ శ్రీమతి శీలం వెంకట లక్ష్మి గారు, AMC చైర్మన్ శ్రీ వెన్నుపూసల సీతారాములు గారు, IPPB Manager శ్రీ రాజేష్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ప్రత్యేక అతిథులు మరియు ఇతర ప్రముఖులు మాట్లాడుతూ తపాలా శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు, పొదుపు పథకాలు, బీమా సేవలు, India Post Payments Bank (IPPB) సేవల గురించి ప్రజలకు వివరించారు. తపాలా శాఖ అందిస్తున్న వివిధ ప్రజా ప్రయోజనకరమైన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
DCDP – Dak Community Development Programme కార్యక్రమంలో భాగంగా ప్రజలకు తపాలా శాఖ అందిస్తున్న వివిధ ప్రజా ప్రయోజనకరమైన సేవలు, పొదుపు పథకాలు, బీమా, IPPB తదితర సేవలపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తపాలా సేవలను మరింత చేరువ చేయడం, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన పెంపొందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో Mail Overseers శ్రీ M. లక్ష్మణ్ గారు, శ్రీ P. నాగేశ్వరరావు గారు, SO పరిధిలోని BPMలు, ABPMలు, అలాగే కార్యాలయ సిబ్బంది Postal Assistant శ్రీ కనకాచారి గారు, Postman శ్రీ ఉపేందర్ రెడ్డి గారు పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.
అలాగే BPMలుగా శ్రీ గోవిందరావు, శ్రీ ఉపేందర్, శ్రీ మోహన్ రావు, శ్రీమతి కృష్ణ వేణి, శ్రీమతి జానకమ్మ, శ్రీ సందీప్, శ్రీ అజయ్, శ్రీ రామకృష్ణ, శ్రీ సత్యనారాయణ సింగ్, శ్రీ సత్యనారాయణ, శ్రీమతి సుచిత, శ్రీమతి చరిత, శ్రీమతి నవ్య, శ్రీ జయ వర్ధన్ తదితరులు, ABPMలుగా శ్రీమతి ఓంకారమ్మ, శ్రీమతి అనూష, శ్రీ రాకేష్, శ్రీ ప్రణయ్, శ్రీ తిరుమలేశ్, శ్రీ దీపక్, శ్రీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన ఉప తపాలా కార్యాలయం ప్రారంభంతో నేలకొండపల్లి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన, సులభమైన మరియు విస్తృతమైన తపాలా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా తపాలా శాఖ సేవలను మరింత విస్తరించేందుకు ఈ నూతన ఉప తపాలా కార్యాలయం కీలకంగా ఉపయోగపడనుంది.
ప్రజలకు తపాలా శాఖ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పిస్తూ, నూతన ఉప తపాలా కార్యాలయ ప్రారంభోత్సవం మరియు DCDP కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
