చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం.

Spread the love

చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

  మోడీ పాలనను నిరసిస్తూ కేంద్రంలో మార్పు కోరుతూ నేడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బద్లావ్ జరూరి పేరుతో జరిగిన బహిరంగ సభకు దేశ నలుమూలల నుండి పాల్గొన్న కార్యకర్తలతో పాటు మేడ్చల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
 ఈ సందర్బంగా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాగారు మోడీ ఆవలంబిస్తున్న ఆధాని,పెట్టుబడిదారీ అనుకూల,ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నేడు దేశ ప్రజలు అధిక ధరలు,నిరుద్యోగం లాంటి సమస్యలను ఎదురుకుంటున్నారని వీటిని మాట్లాడకుండా దేవుడి పేరుతో ఇన్ని సంవత్సరాలనుండి చేసిన ప్రచారం ను ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని కావున ప్రజలు మోడీని బీజేపీని గద్దె దించడానికి సిద్ధం అయ్యారని దానికి నిదర్శనమే ఇప్పుడు ఎక్కడ ఉద్యమం జరిగినా ప్రజలు స్వచ్చందంగా పాల్గొంటున్నారని కావున సిపిఐ కార్యకర్తలు మోడీ ని గద్దె దించి వామపక్ష ప్రభుత్వాలను ఏర్పడటానికి కృషి చెయ్యాలని కోరారు.
 ఈ బహిరంగ సభలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారని దాంట్లో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,మండలం సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు,రాములు,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణ్,బాబు యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్న్,కీర్తి,పార్టీ నాయకులు మల్లేష్,శ్రీనివాస్,జంబూ,కమలమ్మ,నీలమ్మ,ఈశ్వర్ లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top