
ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఈఆర్ఓ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు .
*ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్ లో భాగంగా ఓటర్లకు అందజేస్తున్న నోటీసుల పై బి ఎల్ ఓ లకు సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ,నోటీసులు అందుకున్న ఓటర్లను కార్యాలయాలకు పిలిపించి ఇబ్బందులకు గురి చేయకుండా, బీఎల్ఓ లు వారి ఇళ్లకు వెళ్లి నోటీసులను అందజేయడం అవసరమైన వివరాలను సేకరించడం వంటి చర్యలు చేపట్టాలని ,ప్రజలకు భయాందోళనలు కలగకుండా ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించాలన
అలాగే ఫారం-6 కు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత ఇవ్వాలని, ఫారం-6 సమర్పించే సమయంలో ఏయే పత్రాలు/డాక్యుమెంట్లు అవసరమో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అదేవిధంగా ఎస్ఐఆర్ లో భాగంగా ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తున్నారో వారి జాబితాను, అలాగే ASDD జాబితాను గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని అధికారులను కోరారు.
“ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలనీ ఓటర్లలో భయాందోళనలు కాకుండా అవగాహన కల్పించడం అధికారుల ప్రధాన బాధ్యత” అన్నారు.
ఈ కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, సీనియర్ నాయకులు మమత, రోజా, మల్లారెడ్డి, సతీష్ రావు, అనిల్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, సుబ్బరాజు, సంగారెడ్డి, గోపు శ్రీనివాస్, సంజీవరెడ్డి, రాయల్ కార్తీక్, జనార్దన్ గౌడ్ ,తిరుమలేష్ ,నరేందర్ యాదవ్, రామకృష్ణ ,శివరాజ్ , విజయ్ రెడ్డి, జమీర్, అల్లావుద్దీన్ పటేల్, సంతోష్, శేఖర్ గౌడ్ ,శ్రీనివాస్ రెడ్డి, డా సుదర్శన్, బిఆర్ఎస్ బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
