ఎల్లమ్మబండ హిందు, ముస్లిం మరియు క్రిస్టియన్ స్మశానవాటిక సుందరికరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

ఎల్లమ్మబండ హిందు, ముస్లిం మరియు క్రిస్టియన్ స్మశానవాటిక సుందరికరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ హిందు, ముస్లిం మరియు క్రిస్టియన్ స్మశానవాటిక లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియచేసారు అంతిమయాత్రలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మశానవాటికకు కావలిసిన అన్ని మౌలిక వసతులు చేకూర్చుతామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో షౌకత్ అలీ మున్నా, ఖాజా, నవాజ్, సమ్మద్, కైసర్, సుల్తాన్, ఖాజా, ఖలీమ్, ఇంతియాజ్, గౌస్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top