
కుత్బుల్లాపూర్ కురుమ సంఘం శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం వెంకన్న హిల్స్‌లో కురుమ సంఘం శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో రూ.18.50 లక్షల నిధులు మంజూరు కాగా, ఈ నిధులతో చేపట్టనున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కురుమ సంఘం శ్మశాన వాటిక నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
శ్మశాన వాటిక నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల కురుమ సంఘం కమిటీ సభ్యులు మరియు కురుమ కులస్థులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, కొలన్ హన్మంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కే.ఎం. గౌరీష్ గారు, డివిజన్ అధ్యక్షులు, కురుమ సంఘం కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
