ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

Spread the love

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్
శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలి – ఎమ్మెల్సీ పదవి నుంచి తాతా మధును బర్తరఫ్ చేయాలని డిమాండ్

హైదరాబాద్, : శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక శాసనమండలి సభ్యుడు, దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా అభ్యంతరకరమని శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. శాసనసభాపతి పదవి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవాన్ని, హుందాతనాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా, తాతా మధు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని స్పష్టం చేశారు.

తాతా మధుపై తక్షణమే తగిన చర్యలు తీసుకుని, ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని శ్రీ కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు తాతా మధు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగ పదవుల ప్రతిష్ఠను కాపాడేందుకు ఇలాంటి వ్యాఖ్యలపై సంబంధిత అధికారులు, శాసనసభ మరియు శాసనమండలి తగిన చర్యలు తీసుకోవాలని శ్రీశైలం గౌడ్ విజ్ఞప్తి చేశారు.

You cannot copy content of this page

Scroll to Top