
రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ పోరుబాట!
వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలం…
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజల నిరసన తెలిపే హక్కును కాపాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూక్యా ధర్మ నాయక్ ఆధ్వర్యంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు .
కేసీఆర్ పై బెదిరింపు వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు.
ప్రతిపక్ష నాయకులను కేటీఆర్ , హరీష్ రావు , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మహిళా ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులతో వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి.. ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాదు.
కేసీఆర్ కి భద్రత కల్పించాలని, బెదిరింపు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు గిద్దరిగి సత్యనారాయణ, సాంబయ్య, దేవదాస్, మాజీ సర్పంచులు బోడా వినోద్, భూక్యా బాలాజీ, షేక్ బాజీ, కడియాల సుధాకర్, గోపి, ప్రశాంత్, రామిశెట్టి వంశీ బాబ్లు మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
