దేవేందర్ నగర్ కాటమైసమ్మ బస్తీలో రూ.34 లక్షలతో నాలుగు రోడ్ల పనులు ప్రారంభం

Spread the love

దేవేందర్ నగర్ కాటమైసమ్మ బస్తీలో రూ.34 లక్షలతో నాలుగు రోడ్ల పనులు ప్రారంభం

277వ డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాటమైసమ్మ బస్తీలో రూ.34 లక్షల వ్యయంతో నాలుగు రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలను హన్మంత్ రెడ్డి చొరవతో ఈ నూతన రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా 277వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పనులను సందర్శించి, స్థానికులతో మాట్లాడారు. రోడ్డు పనులు పూర్తయితే బస్తీ ప్రజలకు రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

స్థానిక ప్రజల సమస్యలను గుర్తించి, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బస్తీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top