
గాంధీభవన్ :- టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గాంధీభవన్‌కు విచ్చేసిన మహేశ్ కుమార్ గౌడ్ కి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి, డప్పు కళాకారులతో ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. మహేశ్ కుమార్ గౌడ్ సారథ్యంలో టీపీసీసీ బలమైన శక్తిగా మారిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి –పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై, రానున్న రోజుల్లో మరోసారి రాష్ట్రంలో విజయఢంకా మోగిస్తుందని జక్కిడి శివచరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
