పద్మనగర్ ఫేజ్-1 తాగునీటి సమస్య పరిష్కరించాలి

Spread the love

పద్మనగర్ ఫేజ్-1 తాగునీటి సమస్య పరిష్కరించాలి
జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వినతి

కుత్బుల్లాపూర్: పద్మనగర్ ఫేజ్-1 కాలనీ వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ (ఐఏఎస్)ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కాలనీలో మంచినీటి సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నూతనంగా ఏర్పాటు చేయాల్సిన పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జలమండలి అధికారిని కోరారు.

ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పద్మనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top