
కోవూరులో అడుగుపెట్టిన లోకేష్ ఉత్సాహంతో కార్యకర్తల సందడి.
యన్.టి.ఆర్. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్..
కోవూరులో పసుపు పండగ వాతావరణం
మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన వేమిరెడ్డి దంపతులు
రుక్మిణి కళ్యాణమండపం నుంచి హైవే దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు కొనసాగిన భారీ ర్యాలీ
విగ్రహావిష్కారానికి బ్రహ్మరథం పట్టిన కోవూరు ప్రజలు..
మంత్రి నారా లోకేశ్ కు వేమిరెడ్డి దంపతులు ఘన స్వాగతం పలికారు. కోవూరు రుక్మిణి కళ్యాణమండపం నుంచి హైవే దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దాకా భారీ ర్యాలీ అడుగడుగునా కోవూరు ప్రజలు మంత్రి లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలతో ఆయనకు బ్రహ్మ రథం పట్టారు.వారితో కోవూరుఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, యువ నాయకుడు అర్జున్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం హైవే దగ్గర ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.విగ్రహ ఆవిష్కరణకు జిల్లా నలుమూల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆవిష్కరించి తాతగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోవూరు మొత్తం పసుపు పండగ వాతావరణం కనిపించింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
