
ఉయ్యూరు బజాజ్ షోరూం లో125 & పల్సర్ 150 బైక్ లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్
భారతదేశపు ఐకానిక్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బజాజ్ పల్సర్, తన సరికొత్త Pulsar 125 మరియు Pulsar 150 మోడళ్లను ఉయ్యూరు మెయిన్ రోడ్ లో గల బజాజ్ షోరూం లో మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ పాల్గొని ఆవిష్కరించారు .
ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ..
2001లో Pulsar 150తో ప్రారంభమైన పల్సర్ ప్రయాణం భారతీయ మోటార్‌సైక్లింగ్ రంగంలో స్పోర్టీ డిజైన్, పనితీరు మరియు రైడింగ్ అనుభవానికి కొత్త ప్రమాణాలను తీసుకొచ్చిందని, అలాగే 25 ఏళ్లుగా కోట్లాది రైడర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్న Pulsar, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ, మెరుగైన ఇంజినీరింగ్ మరియు మరింత ఆధునిక డిజైన్‌తో కొత్త తరం రైడర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైందని రాజేంద్రప్రసాద్ వివరించారు..
తక్కువ ధరలో, నాణ్యమైన, నమ్మకమైన సర్వీస్ తో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి మోడల్స్ ను మరిన్ని అందించి,కొనుగోలుదారుల విశ్వాసాన్ని పొందాలని రాజేంద్రప్రసాద్ సూచించారు..
ఈ కార్యక్రమం లో వరుణ్ బజాజ్ కంపెనీ సేల్స్ ASM సదత భాష,బిజినెస్ హెడ్ KV రామారావు, GM పద్మజా,షోరూం AGM M B R PRASAD, మేనేజర్ N నాగబాబు సిబ్బంది మరియు కస్టమర్ లు, బైక్ మెకానిక్ లు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
