
కుత్బుల్లాపూర్:* కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *కొలన్ హన్మంత్ రెడ్డి మాతృమూర్తి, కీ.శే. కొలన్ సులోచన ఈ నెల 9 వ తేదీన అకాల మరణం చెందడంతో, ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు విచ్చేసి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా మేడ్చల్- మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జి పరమేష్ రెడ్డి,జిల్లా గ్రంధాలయం చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి కొలన్ హన్మంత్ రెడ్డి ని పరామర్శించి, సులోచనమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
సులోచన మృతి పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు
ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
