మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు.

Spread the love

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు..

మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జాతీయ జెండాను మరియు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ప్రజల ఐక్యత, త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top