
గాజులరామారం సర్కిల్లో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
గాజులరామారం: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గాజులరామారం సర్కిల్ పరిధిలోని వొక్షిత్ ఎంక్లేవ్-1, 2 కాలనీలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు రెండు కాలనీలలోని గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
అనంతరం వినాయక మండపాల నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని మరియు శ్రీనివాస్ గౌడ్ ని శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి తో పాటు లక్ష్మీ నారాయణ రెడ్డి, యం సాగర్ మరియు కాలనీల సభ్యులు గోపాల్ రెడ్డి, శివ, శ్రీకాంత్ రెడ్డి, సూరపు రాజు, కిరణ్, వేణు రాజులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
