
గాజులరామారం సర్కిల్‌లో పలు గణనాథులను దర్శించుకున్న కూన శ్రీనివాస్ గౌడ్ .
గాజులరామారం: గాజులరామారం సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.
బాలాజీ లేఔట్, వీనస్ ఎన్‌క్లేవ్, JNNURM వొక్షిత్ ఎన్‌క్లేవ్-1, 2 కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం వినాయక మండపాల నిర్వాహకులు కూన శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డితో పాటు లక్ష్మీనారాయణ రెడ్డి, యం. సాగర్, కాలనీ సభ్యులు గోపాల్ రెడ్డి, శివ, శ్రీకాంత్ రెడ్డి, సూరపు రాజు, కిరణ్, వేణు రాజు, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు,పవన్ గుప్త, సురేష్, అంజన్న, సంజయ్, వినయ్,తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
