
నవజీవన్ నగర్లో శ్రీ లక్ష్మి విజయ గణపతి ఆలయంలో ఘనంగా నవరాత్రి పూజలు – ఇందిరమ్మ చీరల పంపిణీ
బాలానగర్ డివిజన్ పరిధిలోని నవజీవన్ నగర్లో ఉన్న శ్రీ లక్ష్మి విజయ గణపతి టెంపుల్లో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు ఆహ్వానం మేరకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు చీరలను పంపిణీ చేసి, మహిళల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న చొరవను వివరించారు. నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ బండి రమేష్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొండకింది పుష్ప రెడ్డి, తూము సంతోష్, మధుమోహన్, జిల్లా శివకుమార్, సప్పిడి భాస్కర్, రమణ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
