బతుకమ్మ దరరా ఉత్సవాలకు అవసరమగు అన్ని సదుపాయాలు సమకూర్చుతాం – మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

బతుకమ్మ దరరా ఉత్సవాలకు అవసరమగు అన్ని సదుపాయాలు సమకూర్చుతాం – మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ప్రతి ఏటా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా నిర్వహించే బతుకమ్మ దసరా ఉత్సవాలు ఈసారి కూడా అంబిర్ చెరువు కట్ట మీద ఘనంగా నిర్వహించే విషయమై ఉత్సవాలు నిర్వహించే స్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా జరుపుకునే బతుకమ్మ దసరా ఉత్సవాలకు వారి సౌకర్యార్థం అవసరమగు అన్ని ఏర్పాట్లును అందిస్తామని అన్నారు. మైదానాన్ని గుంతలు లేకుండా చదునుచేసి, డస్టింగ్, లైటింగ్, మంచినీటి సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంబిర్ చెరువు కట్ట పైన జెసీబీ తో చదును చేసి ఉత్సవాలకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. ఉత్సవాలు జరిగే ప్రాంగణాన్ని మరియు పరిసర ప్రాంతాలను పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయించి బతుకమ్మ ఆడే మహిళల కోసం సిద్ధం చేస్తున్నామని తెలియచేసారు. మనంనుందరం కలిసి ప్రతి సంవత్సరంలాగానే ఈసారికూడా బతుకమ్మ దసరా పండుగ ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, నరసింహులు, సిద్దయ్యా, గిరి, సత్యం, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

           ఉత్సవాల వివరాలు

         బతుకమ్మ ఉత్సవాలు

తేదీ : 18-10-2026 ఆదివారం రోజున
టైం. : సాయంత్రం 6:00 గంటలకు
స్థలం : శివమ్మా కాలనీ రామాలయం దగ్గర, అంబిర్ చెరువు కట్టమీద

            దసరా ఉత్సవాలు

తేదీ : 20-10-2026 మంగళవారం రోజున
టైం : సాయంత్రం 6:00 గంటలకు
స్థలం : శివమ్మా కాలనీ రామాలయం దగ్గర, అంబిర్ చెరువు కట్టమీద

You cannot copy content of this page

Scroll to Top