ఎనిమిది టన్నుల భారీ లడ్డు తయారీ.. రత్న బేకరీ ప్రత్యేకత. ప్రత్తిపాటి పుల్లారావు

Spread the love

ఎనిమిది టన్నుల భారీ లడ్డు తయారీ.. రత్న బేకరీ ప్రత్యేకత. ప్రత్తిపాటి పుల్లారావు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చిలకలూరిపేటలో ఎనిమిది టన్నుల భారీ లడ్డును తయారు చేయడం జరిగిందని మాజీ మంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కోసం ఈ భారీ లడ్డును ప్రత్యేకంగా రూపొందించారు.


చిలకలూరిపేట పట్టణంలోని దశాబ్దాలుగా మంచి పేరున్న ‘రత్న బేకర్స్’ ప్రొప్రైటర్ నాగేశ్వరరావు మరియు వారి కుమారుడు అభిషేక్ ఆధ్వర్యంలో ఈ ఎనిమిది టన్నుల లడ్డు తయారీ ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకున్నదని ఆయన కొనియాడారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి డి.ఎన్.డి. సురేష్ స్పాన్సర్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. గత 40 ఏళ్లుగా చిలకలూరిపేటలో బ్రాండెడ్‌గా కొనసాగుతున్న రత్న బేకరీస్ ల్యాండ్‌మార్క్‌ను ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్లారని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశంసించారు. గుంటూరులో ప్రజల సందర్శనార్థం ఈ లడ్డును ప్రత్యేక ర్యాలీ నిర్వహించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకను విజయవంతంగా తయారు చేసిన నాగేశ్వరరావు మరియు అభిషేక్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top