
ఎనిమిది టన్నుల భారీ లడ్డు తయారీ.. రత్న బేకరీ ప్రత్యేకత. ప్రత్తిపాటి పుల్లారావు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చిలకలూరిపేటలో ఎనిమిది టన్నుల భారీ లడ్డును తయారు చేయడం జరిగిందని మాజీ మంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కోసం ఈ భారీ లడ్డును ప్రత్యేకంగా రూపొందించారు.
చిలకలూరిపేట పట్టణంలోని దశాబ్దాలుగా మంచి పేరున్న ‘రత్న బేకర్స్’ ప్రొప్రైటర్ నాగేశ్వరరావు మరియు వారి కుమారుడు అభిషేక్ ఆధ్వర్యంలో ఈ ఎనిమిది టన్నుల లడ్డు తయారీ ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకున్నదని ఆయన కొనియాడారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి డి.ఎన్.డి. సురేష్ స్పాన్సర్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. గత 40 ఏళ్లుగా చిలకలూరిపేటలో బ్రాండెడ్‌గా కొనసాగుతున్న రత్న బేకరీస్ ల్యాండ్‌మార్క్‌ను ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్లారని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశంసించారు. గుంటూరులో ప్రజల సందర్శనార్థం ఈ లడ్డును ప్రత్యేక ర్యాలీ నిర్వహించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకను విజయవంతంగా తయారు చేసిన నాగేశ్వరరావు మరియు అభిషేక్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
