
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ దసరా శుభాకాంక్షలు.
ఏలూరు, : విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజలందరికీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తులపై దైవశక్తి, అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని చెప్పిన ఎంపీ, ఆ దుర్గామాత దివ్య ఆశీస్సులు ఏలూరు జిల్లా ప్రజలందరితోపాటు, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రులు సందర్భంగా ఇటీవల తాను ఏలూరులో పలు దేవాలయాల్లో అమ్మవారి సేవలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెబుతూ, అమ్మవారి కరుణా కటాక్షాలతో ఏలూరు జిల్లా సుభిక్షంగా వర్థిల్లాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇట్లు
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కార్యాలయం,
ఏలూరు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
