బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జన్మదిన వేడుక

Spread the love

బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జన్మదిన వేడుకలకు భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు.

పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ జన్మదిన వేడుకలు ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యాంపు కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారగా, ఎమ్మెల్యే కి పుష్పగుచ్ఛాలు అందజేస్తూ, శాలువాలతో సత్కరిస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కి పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top