ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల

Spread the love

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల

659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 14 వ తేది ఎన్నికల షెడ్యూల్‌లో ప్రకటించిన విధముగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 28 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో 659 జెడ్పీటీసీ స్థానాలకు, 659 మండల ప్రజా పరిషత్‌ల పరిధిలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 663 జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు, 9,858 ఎంపీటీసీ స్థానాల్లో 29 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు.

ఎన్నికల ముఖ్య వివరాలు:

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సుమారు 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో సుమారు 1.38 కోట్ల మంది పురుషులు, 1.42 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ప్రజా పరిషత్‌లకు 28 మంది రిటర్నింగ్ అధికారులు, 659 మండల ప్రజా పరిషత్‌లకు 687 మంది రిటర్నింగ్ అధికారులు, అదనంగా 1,374 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు.
పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,41,332 మంది ఇతర పోలింగ్ అధికారుల సేవలను వినియోగించుకోనున్నారు.

పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు:

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 35,333 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 9,966 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, 9,186 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు, 16,181 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వివరించారు.

అభ్యర్థుల డిపాజిట్, ఎన్నికల వ్యయ పరిమితి
ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిపాజిట్ మొత్తం రూ.1,500 కాగా, ఇతర అభ్యర్థులకు రూ.3,000గా నిర్ణయించారు.

జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిపాజిట్ రూ.3,000 కాగా, ఇతర అభ్యర్థులకు రూ.6,000గా నిర్ణయించారు.

ఎన్నికల వ్యయ పరిమితి
ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రిజర్వేషన్లు, ఇతర వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

నామినేషన్ కేంద్రాల్లో ఘటనలపై కలెక్టర్ల నుంచి నివేదికలు – తగిన చర్యలకు ఆదేశాలు
నామినేషన్ కేంద్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
నామినేషన్ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న ఘటనలపై సంబంధిత జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లాలోని కొన్ని నామినేషన్ కేంద్రాల వద్ద చిన్నపాటి ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో మైదుకూరు మునిసిపాలిటి లోని కొన్ని వార్డులలో నామినేషన్ పత్రాలు చినిగిపోయినట్లు జిల్లా కలెక్టర్, కడప నివేదిక సమర్పించారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించి, మైదుకూరు మునిసిపాలిటి ఎన్నికలను నిలుపుదల చేసియున్నారు.

నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించామన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వెంకట రామకృష్ణ తేజ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటి వివరాల ప్రచురణ, రిజర్వేషన్ల ఖరారు, గెజిట్ ప్రచురణ వంటి కీలక ప్రక్రియలను పూర్తిచేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఈసారి మొత్తం 28 జిల్లా పరిషత్‌ల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

గతంలో జిల్లాల విభజనకు ముందు 13 జిల్లా పరిషత్‌ల పరిధిలో మాత్రమే ఎన్నికలు జరిగాయని వివరించారు.
రాష్ట్రంలో మొత్తం 663 రెవెన్యూ మండలాలు ఉన్నాయని, ప్రతి రెవెన్యూ మండలాన్ని ఒక జెడ్పీటీసీ నియోజకవర్గంగా పరిగణిస్తారని తెలిపారు. మచిలీపట్నం, ఆదోని మండలాల విభజనతో పాటు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కావడంతో ఈసారి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు.

అమరావతి ప్రాంతంలోని నాలుగు మండలాలను మినహాయించి మిగిలిన 659 మండలాల్లో ఎన్నికల ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. అమరావతి ప్రాంతంలోని మండలాల విషయంలో భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయం …

You cannot copy content of this page

Scroll to Top