అక్రమ కేసులు, ప్రలోభాలకు భయపడేది లేదు: మాజీ మంత్రి జోగి రమేష్ ధీమా..

Spread the love

అక్రమ కేసులు, ప్రలోభాలకు భయపడేది లేదు: మాజీ మంత్రి జోగి రమేష్ ధీమా..

  • కొండపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం.
  • 40 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ముమ్మర ప్రచారం.

ఎన్టీఆర్ జిల్లా.
కొండపల్లి,

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా తగ్గేదే లేదని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన స్వయంగా రంగంలోకి దిగి ప్రచారంలో దూసుకుపోతున్నారు.


ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ నాయకులను, వారి కుటుంబాలను మానసికంగా దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తున్నారని, అయితే ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఒక సైన్యంగా తయారుచేసి ప్రజాక్షేత్రంలోకి పంపించారని ఆయన పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పోరులో వైఎస్సార్‌సీపీ తరఫున ఆడసింహాల్లాంటి మహిళా అభ్యర్థులు (చెల్లెమ్మలు) తగ్గేదేలేదంటూ బరిలోకి దిగారని మాజీమంత్రి జోగి రమేష్ చెప్పారు.
తమ అక్కచెల్లెమ్మల అండతో కొండపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులు, మహిళా అభ్యర్థులు వార్డు వార్డునా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని జోగి రమేష్ నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top