
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||
రంగారెడ్డి జిల్లా: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ లోని మల్లిక కన్వెన్షన్ లో ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలోనిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తగా నియమితులైన జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార వ్యూహాలు, పట్టభద్రుల ఓటర్లను సమన్వయం చేయడం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని, పట్టభద్రుల ఓటర్లను కలిసి పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జులు, DCC సభ్యులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, SC, ST, NSUI, INTUC విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
