ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో మాగంటి బాబు, చింతమనేని నవ్యశ్రీ భేటీ.

Spread the love

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో మాగంటి బాబు, చింతమనేని నవ్యశ్రీ భేటీ.
‎
‎ఏలూరు, : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ కుమార్తె  నవ్యశ్రీ వేర్వేరుగా భేటీ అయ్యారు. ముందుగా ఉదయం 10 గంటల సమయంలో ఎంపీ నివాసానికి వచ్చిన మాగంటి బాబు దంపతులు ఎంపీ తో భేటీ అయ్యారు. అనేక సంవత్సరాలుగా పార్టీకి, జిల్లాకు తమ కుటుంబం అందించిన సేవలను గుర్తించి, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా తన భార్య పద్మవల్లి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మాగంటి బాబు ఎంపీని కోరారు.

‎     ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ తన భర్త పృథ్వీ కృష్ణతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసారు. యువత రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత, మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పిన చింతమనేని నవ్యశ్రీ, తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను అభ్యర్ధించారు.

‎     జడ్పీ చైర్ పర్సన్ స్థానం ఆశిస్తున్న ఇద్దరు అభ్యర్ధులు చెప్పినది విన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, విషయాన్ని అధిష్టానం దృష్టికీ తీసుకువెళతానని, అయితే పార్టీ ఎవరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించినా అందరూ కలిసికట్టుగా, పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు.
‎

‎ఇట్లు
‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ yadav కార్యాలయం,
ఏలూరు.

You cannot copy content of this page

Scroll to Top