
తాడేపల్లి
వైఎస్సార్సీపీలో చేరిన జగ్గంపేట నేత పాఠంశెట్టి సూర్యచంద్ర దంపతులు
వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సూర్యచంద్ర, శ్రీదేవి, ముఖ్య అనుచరులు
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి, ముఖ్య అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాఠంశెట్టి సూర్యచంద్ర మూడుసార్లు బూరుగుపూడి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట నరసింహంతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
