
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యం: కూన శ్రీశైలం గౌడ్
శంషాబాద్: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం శంషాబాద్ సమీపంలోని మల్లికా కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని ప్రకటించిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పట్టభద్రుల మద్దతు కూడగట్టి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు, నవంబర్ 6వ తేదీ ఓటర్ నమోదుకు చివరి తేదీ అని ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని సూచించారు..
మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం తన కార్యాలయంలో ప్రత్యేక ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో పార్టీ శ్రేణుల సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని కూన శ్రీశైలం గౌడ్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్ రెడ్డి,రామ్మోహన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , మజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ , మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, పార్టీ ఇన్చార్జులు, కార్పొరేషన్ చైర్మన్లు, NSUI,INTUC, మహిళా కాంగ్రెస్ నాయకులు,వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
