ఏకతాటిపై టీవీకే, డీఎంకే పార్టీలు జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్

Spread the love

ఏకతాటిపై టీవీకే, డీఎంకే పార్టీలు జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్

తమిళనాడు: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమ్మరీ రివిజన్ (SSR)పై చర్చించేందుకు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ సచివాలయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి విజయ్ టీవీకే, దాని మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సహా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించగా, వారంతా దీనిని బహిష్కరించారు.
SIRలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని, ఓటర్ల సవరణ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, పద్ధతి ప్రకారం ఎంపిక చేసిన ఓటర్లను తొలగించడమే దీని లక్ష్యమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి.
మరో సవరణకు ముందు, ఆ వ్యత్యాసాలను సరిదిద్దాలని డిమాండ్ చేశాయి.
డీఎంకే న్యాయ కార్యదర్శి పరంథమెన్ మాట్లాడుతు గత SIR ప్రక్రియలో జాబితా నుంచి తొలగించిన 74 లక్షల ఓటర్లు ఏరి? వారు ఎక్కడికి వెళ్లారు? వారిని దేశం నుండి బహిష్కరించారా? లేక వారు ఇకపై భారతదేశంలో, తమిళనాడులో నివసించడం లేదా? ఈసీ సమాధానం ఇవ్వాలి,” ఆన్నారు. ఇంకా సీఈసీ నీ పదవినుండి తొలగించాలని కోరుతు, రాష్ట్రపతికి లేఖ రాశ్యామన్నారు. జ్ఞానేష్ స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలని, లేకపోతే రాజ్యాంగబద్ధంగా తొలగిస్తామని పరంథమెన్ హెచ్చరించారు.

You cannot copy content of this page

Scroll to Top