మాజీ మంత్రి విడదల రజినిని గట్టిగా తోసి కింద పడేసిన చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక

Spread the love

మాజీ మంత్రి విడదల రజినిని గట్టిగా తోసి కింద పడేసిన చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక

తృటిలో తప్పిన ప్రమాదం

చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద పోలీసుల దౌర్జన్యం. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో, రజినిని కలవడానికి యడ్లపాడు ZPTC అభ్యర్థి దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయిని పోలీసులు నివాసం గేటు వద్దే అడ్డుకున్నారు.

తన నివాసంలోకి వస్తున్న తన వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తూ, వారిని లోపలికి అనుమతించాలని కోరిన మాజీ మంత్రి విడదల రజినిని చిలకలూరిపేట రూరల్ ఎస్‌ఐ ప్రియాంక గట్టిగా తోసి కింద పడేశారు. అంతటితో ఆగకుండా, మరోసారి ఆమెను తోసేందుకు ప్రయత్నించడంతో పాటు, పదునైన అంచు ఉన్న బండపైకి తోసివేసేందుకు కూడా ప్రయత్నించారని ఆరోపించారు.

ఒక మాజీ మంత్రి పట్ల, తన సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నారు

You cannot copy content of this page

Scroll to Top