‎ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో నాయకుల వరుస భేటీలు.

Spread the love

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో నాయకుల వరుస భేటీలు.
‎
‎.. స్థానిక ఎన్నికల కీలక దశలో ఎంపీ తో పలువురు నేతల భేటీ.
‎.. జిల్లాలో పరిస్థితులపై ఎంపీతో ఎమ్మెల్యే బడేటి చంటి చర్చలు.
‎.. ఎంపీతో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మురళి భేటీ.
‎.. స్థానిక సంస్థల ఎన్నికలలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలని చెప్పిన ఎంపీ.
‎
‎ఏలూరు, : స్థానిక సంస్థల ఎన్నికలు కీలక దశలో ఉన్నవేళ ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నుంచి పలువురు నేతలు గత రెండు రోజుల నుంచి  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇంటికి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా జడ్పీ చైర్మన్ అభ్యర్ధి ఎంపికపై సస్పెన్స్ నెలకొనడం, పలు మండలాల్లో టికెట్ల కోసం పోటాపోటీ పరిస్థితులు  నెలకొన్న నేపథ్యంలో  శుక్రవారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి సహా పలువురు నేతలు ఎంపీతో భేటీ అయ్యారు.

‎     మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు, ఆశావహులు, సమన్వయంపై ఇరువురు నేతలు దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం 10 గంటల సమయంలో  మేయర్ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో భేటీ అయ్యారు. కూటమి తరపున ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్ధి గా పోటీ చేస్తున్న జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నగరంలోని రాజకీయ పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మేయర్ ఎన్నికలో రెడ్డి అప్పలనాయుడు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పిన ఎంపీ, ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు.

‎     మధ్యాహ్నం 12గంటల సమయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కొద్దిసేపు భేటీ అయ్యారు. ఉంగుటూరు ఎమ్మెల్యే కలిసి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఉంగుటూరు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన బీజేపీ మహిళా నేత మాలతీరాణి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను కలిశారు. అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తన కుమార్తె జాహ్నవికి మద్దతివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదే జడ్పీ చైర్మన్ అభ్యర్ధిగా రంగంలో ఉన్న మాగంటి బాబు కుటుంబ సభ్యులు, చింతమనేని కుమార్తె నవ్యశ్రీ గురువారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే. జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న నూజివీడుకి చెందిన అట్లూరి రమేష్, పోలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు జగ్గవరపు ముత్తారెడ్డి మరి కొందరు నేతలు కూడా ఎంపీను కలిసినవారిలో ఉన్నారు. ఎవరైనా సరే పార్టీ గీత దాటకుండా, కూటమి పార్టీల నేతలతో సమన్వయంతో వెళ్లాలని తనను కలవడానికి వచ్చిన నేతలతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. సమన్వయంతో ముందుకు వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికలలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలని చెప్పిన ఎంపీ, ఎక్కడైనా తిరుగుబాటు అభ్యర్ధులు రంగంలో ఉంటే వారితో మాట్లాడి, నామినేషన్లు ఉపసంహరించుకునేట్లు వారిని ఒప్పించాలని పార్టీ నేతలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు.
‎ 

‎ఇట్లు
‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం,
ఏలూరు.

You cannot copy content of this page

Scroll to Top