
మైలార్ గూడెం గ్రామంలో PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య .
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
