ఉయ్యూరులో టీడీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి మాజీ ఎమ్మెల్సీ

Spread the love

ఉయ్యూరులో టీడీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ , ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విస్తృత ప్రచారం

ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థితో పాటు కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఒకటి, రెండు, మూడు వార్డుల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..

ఉయ్యూరు అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే మున్సిపాలిటీలో టీడీపీకి బలమైన పాలన అవసరమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉయ్యూరు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చైర్మన్ అభ్యర్థితో పాటు అన్ని వార్డుల్లో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మరింత సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పారు.

Mla బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే టీడీపీ అభ్యర్థుల లక్ష్యమన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు, మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు చైర్మన్ అభ్యర్థితో పాటు కౌన్సిలర్ అభ్యర్థులకు కూడా తమ ఓటుతో ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ నాని ,టీడీపీచైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ ,కౌన్సిలర్ అభ్యర్థులు జంపాన గుర్నాథరావు, మోపిదేవి శేఖర్ మోటో నాగేంద్ర టీడీపీ జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top