
కుత్బుల్లాపూర్ అభివృద్ధికి మరో ముందడుగు.. రూ.60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం!
గాజులరామారం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గాజులరామారం డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు.
హెచ్ఏఎల్ ఈస్ట్, హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీలలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు హెచ్ఏఎల్ కాలనీ నుంచి ఆదర్శ్ నగర్ వరకు లింక్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి. సృజన కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని, కనీసం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ, ఇప్పటివరకు సుమారు రూ.30 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో KKM ట్రస్ట్ అధినేత &డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ తో పాటు హెచ్ఏఎల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆంజనేయులు,వేణుగోపాల్ రెడ్డి, జగన్ గౌడ్, అలీ భాయ్, యాదగిరి, జేబీఎస్ మూర్తి, వేణు ప్రసాద్, వెంకటసుబ్బయ్య, రాంబాబు మరియు స్థానిక డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుచ్చిరెడ్డి , ఇంద్ర సేన రెడ్డి, కూన రాఘవేంద్ర గౌడ్,యం సాగర్, సుజిత్ రెడ్డి తదితరుల తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
