ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లోని బేతల్ గాస్పల్ చర్చ్ లో బ్రదర్ గోపి

Spread the love

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లోని బేతల్ గాస్పల్ చర్చ్ లో బ్రదర్ గోపి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకు బహుమతులు అందిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వారి చేతుల మీదుగా పిల్లలకు బహుమతులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బేతల్ గాస్పల్ చర్చ్ పాస్టర్ గోపి గతం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. చదువుకునే పిల్లలకు ఉచితంగా ట్యూషన్స్ చెప్తూ, భోజనం పెట్టడం అభినందించే విషయం అని అన్నారు. పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తూ వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తున్న పాస్టర్ గోపి కి కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, ఖలీమ్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top