పండుగ వాతావరణంలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

Spread the love

పండుగ వాతావరణంలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

చేయూత అంటే కేవలం పింఛన్ కాదు, పేదోళ్లకు భరోసా

సంక్షేమం నిరంతర ప్రక్రియ

చేయూత పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా

విద్య, వైద్యం, సామాజిక భద్రతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మండ లోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన చేయూత పింఛన్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ సర్కిల్ డీసీ శ్రీమతి చాముండేశ్వరి , తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని 1112 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరి పత్రాలను అందచేసిన PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సామాజిక భద్రత ప్రతి ఒక్కరి హక్కు అనే నినాదం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభాగ్యుల పట్ల పెద్ద మనస్సుతో వారికి అండగా నిలుస్తూ చేయూత రూపంలో చేయూత నందిస్తున్న గొప్ప మహనీయుడు అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు.అవ్వా, తాతలకు, అసహాయులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నారు అని,అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తాం.. అండగా ఉంటాం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడం,అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని,అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం చేయూత పింఛన్లను మంజూరు చేయడం జరిగినది అని మంజూరి పత్రాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

చేయూత పింఛన్లు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు గౌరవప్రదమైన జీవనానికి అండగా నిలుస్తాయని , పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూస్తామని, అన్ని విధాలుగా అండగా నిలుస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ది, సంక్షేమం ను ఎక్కడ ఆపకూడదు అనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో పింఛన్లు అందించడం జరుగుతుంది అని,మహిళ సంక్షేమానికి , బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నారు అని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం అని , అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలిపారు.

పేదలకు పింఛన్ భరోసా.. ప్రతి కుటుంబానికి సొంతింటి భరోసా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ సంకల్పం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులందరికీ చేయూత అందిస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, పింఛన్ల పంపిణీ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని ,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ లక్ష్యం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు

శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మొత్తం 3,149 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరైనవి అని

శేరిలింగంపల్లి సర్కిల్ లబ్ధిదారులు -1080

చందానగర్ సర్కిల్ లబ్ధిదారులు -957

ఆల్విన్ కాలనీ సర్కిల్ లబ్ధిదారులు -1112

మొదటి విడతలో మంజూరైన చేయూత పింఛన్లు వివరాలు

  1. వితంతువులు
  2. ఒంటరి మహిళలు
  3. వికలాంగులు
  4. ఈత కల్లు గీతకారులు
  5. చేనేతకారులు
  6. పైలేరియా
  7. డయాలాసిస్

ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు,కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top