
| కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా మరో 6,685 మందికి పింఛన్ల మంజూరు – ఘనంగా పంపిణీ కార్యక్రమం ||
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (కాంగ్రెస్) ఆధ్వర్యంలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కేవీఆర్ గార్డెన్స్ (కొంపల్లి ) నందు అర్హులైన నిరుపేదలకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
వృద్ధులు, దివ్యాంగులు, ఇతర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా మరో 6,685 మందికి పింఛన్లు మంజూరు చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
కొంపల్లిలోని కేవీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నూతన పింఛన్ల మంజూరుతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు
నియోజకవర్గ పరిధిలోని చింతల్ – 1,657, దుండిగల్ – 793, గాజులరామారం – 1,214, కొంపల్లి – 1,465, నిజాంపేట మున్సిపల్ పరిధిలో 520, కుత్బుల్లాపూర్ – 1,036, మందికి నూతనంగా పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. డిసెంబర్ నెల నుండి, 6,685 మంది లబ్ధిదారుల ఖాతాలకు పెన్షన్ అందనుంది.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పింకేష్ (ఐఏఎస్) , డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ తో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డీసీసీ కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, INTUC, NSUI నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
