
కొంపల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
!!కొంపల్లిలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు!!.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 6,700, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల చేయూత పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, ఇన్చార్జ్ హనుమంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
