శ్రీ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలో శ్రీనివాస్ నగర్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయం రెండో వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అరుణ్ గురు స్వామి, బ్రహ్మ శ్రీ రాజన్ నంబూద్రి గురు స్వామి, నాగార్జున ఆచార్యులు (లాలూ స్వామి) ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నిజాంపేట్ లోని అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల కోరికలు తీరుస్తూ అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందన్నారు. అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు భక్తులపై తప్పక ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రఘూవేంద్ర రావు, రవి కిరణ్, బాలాజీ నాయక్,బొర్రా దేవి చందు ముదిరాజ్,మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, హరి బాబు, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
