రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తిచేసి దుండిగల్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ – మియాపూర్ , బహదూర్ పల్లి – కొంపల్లి రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా మల్లం పేట్ రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పు వంటి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, తద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చన్నారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని అన్నీ వార్డులలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి దుండిగల్ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్, ట్రాఫిక్ ఏసిపి గిరి ప్రసాద్, ఎమ్మార్వో మతిన్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
