నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు.

Spread the love

నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు…. — పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ .

పల్నాడు జిల్లా  నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.

పమిడిమర్రు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా … ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీ లలో సరైన పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, గొడ్డళ్లు, కర్రలు, పలుగులు మారణాయుధాలు స్వాధీనపర్చుకోవడమైనది
అంతేకాకుండా… రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


గ్రామంలో నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితుల/ పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో… పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలు, దుకాణాలు, బడ్డీ కొట్లలో క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ పసుపులేటి రామకృష్ణ, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై కిషోర్ , నరసరావుపేట ఒకటవ పట్టణ సిఐ పోలీస్ స్టేషన్ MV.చరణ్ , నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై వంశీకృష్ణ , నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ హైమా రావు , నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ అశోక్ , చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top