బీజేపీ నేత ఎంఆర్ రాజా జయంతి వేడుక
తిరుపతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఆర్ రాజా 78వ జయంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు గుండాల గోపినాధ్ రెడ్డి నె్తృత్వంలో తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక గోవిందరాజు స్వామి దక్షిణ మాడవీధిలో ఎమ్మార్ రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భక్తులకు, పేదలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి సాంస్కృతి విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ యమ్ఆర్ రాజా ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బిజెపి సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్, బిజెపి తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బిజెపి యువమోర్చా నాయకులు రాజశేఖర్ రెడ్డి, నాయకులు బంకు చంద్రారెడ్డి, కరణ్ నాగేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
