సుపరిపాలనాలో తొలి అడుగులో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇంచార్జ్ మరియు కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ …
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం డోర్ టు డోర్ క్యాంపెనింగ్ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో తన నూతన గృహం వద్ద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా,ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి,అమలు చేసిన సంక్షేమ పథకాలు,సాధించిన విజయాలు అలాగే కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియజేసే ప్రక్రీయే డోర్ టు డోర్ క్యాంపైనింగ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలి.ఈ కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ యూనిట్,బూత్ ఇంచార్జ్ లు మరియు మండల పార్టీ అధ్యక్షులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కె ఎస్ ఎస్ సభ్యులు తమ వంతు బాధ్యతగా ప్రతి ఇంటిని ప్రతి గడపను సందర్శించి గడపగడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో సందర్శించిన ఇళ్లను నమోదు చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మై టిడిపి అని అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ యాప్ లో ఉపయోగించే విధానాలను వివరంగా పొందుపరిచి ఉన్నారు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐదు మండలాల మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు…

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
