Spread the love

సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించి భక్తుల ఆగ్రహానికి గురికావద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ, కళ్యాణం, బోనాల ఉత్సవాల వంటి పవిత్ర కార్యక్రమాల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త విధానాలకు తెరతీయవద్దని స్పష్టం చేశారు. ఎంతో భక్తితో భక్తులు ఆలయాలకు వస్తారని, వివిధ రకాల పేర్లతో భక్తుల నుండి డబ్బు వసూలు చేసే విధానాలను మానుకోవాలని అన్నారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో, సంతోషంగా జరిగేలా చూడాలి తప్ప వివాదాలకు అవకాశం ఇవ్వవద్దని అన్నారు. భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకుంటారని చెప్పారు. పాత పద్దతులనే పాటించాలని డిమాండ్ చేశారు. నూతన విధానాలు అమలు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వం, అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మహంకాళి జాతర ఆహ్వానం

జులై 13 వ తేదీన నిర్వహించే బోనాల ఉత్సవాలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జాయినీ మహంకాళి ఆలయ అధికారులు వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ముందుగా ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలను ఎప్పటి మాదిరిగానే నిర్వహించాలని, కొత్త విధానాలను తీసుకొచ్చి గందరగోళం సృష్టించవద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో EO మనోహర్ రెడ్డి, రాంగోపాల్ పేట డివిజన్ BRS అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ కామేష్, మాజీ కమిటీ సభ్యులు మహేష్ యాదవ్, మహేందర్, ఆనంద్ పాటిల్, చందు, రాంమోహన్ యాదవ్ తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top