ఎడ్యూవ్యాలీ” స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాని
తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని భాకరాపేటలో నూతన “ఎడ్యూవ్యాలీ” పాఠశాలను ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పిల్లలకోసం వ్యాలీ స్కూల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ స్కూల్ చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలెం మండలాలలో ఉన్న పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే ముఖ్య ఉద్దేశంతో జయచంద్రారెడ్డి ఈ నూతన స్కూల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు భాకరాపేటలో స్కూల్ ప్రారంభించడంతో సమీపంలోని చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలెం మండలాలలో మెరుగైన విద్యను విద్యార్థులకు అందించాలన్న దృడ సంకల్పంతో పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో “ఎడ్యూవ్యాలీ” పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
